గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణం.. కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు మృతి
కేరళలోని కొచ్చిలో కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు మృతి చెందారు.
By Medi Samrat Published on 1 Oct 2023 10:45 AMకేరళలోని కొచ్చిలో కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నడిపే వ్యక్తి గూగుల్ మ్యాప్ సహాయంతో డ్రైవింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. భారీ వర్షం, దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
వార్తల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు గోతురుత్ ప్రాంతంలో పెరియార్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో యువ వైద్యులు అద్వైత్ (29 ఏళ్లు), అజ్మల్ (29 ఏళ్లు) మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది.
కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ సహాయంతో డ్రైవింగ్ చేస్తున్నాడని.. అయితే భారీ వర్షం, తక్కువ దృశ్యమానత కారణంగా డ్రైవర్ నదిని చూడలేకపోయాడని.. కారు బ్యాలెన్స్ తప్పి నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.