కర్ణాటకలోని మంగళూరులోని తమ ఇంట్లో ఓ మహిళ తన 87 ఏళ్ల మామను వాకింగ్ స్టిక్‌తో కొట్టడం కెమెరాకు చిక్కింది. ఈ ఘటన మార్చి 9న జరిగింది. సీసీటీవీ ఫుటేజీలో కర్ణాటక ఎలక్ట్రిసిటీ బోర్డ్ (కేఈబీ) అధికారిణి అయిన ఉమా శంకరి.. వాకింగ్ స్టిక్ ను పట్టుకుని తన మామ పద్మనాభ సువర్ణను కొట్టడం ఆ ఫుటేజీలో చూడొచ్చు. ఆమె వృద్ధుడిని పదే పదే కొట్టింది. అతను వేడుకుంటున్నట్లు, దాడి చేయవద్దని కోరడం మనకు కనిపిస్తుంది. పద్మనాభం తన కోడలు కొట్టకుండా ఆపడానికి ప్రయత్నించినా కూడా వీలవ్వలేదు. ఉమ అతన్ని నేలపైకి పడేసింది. ఆ వృద్ధుడు కిందపడటంతో సోఫా తగిలింది.
ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. ఇంట్లోని పెద్దోళ్ళపై ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు చెబుతున్నారు. ఉమా శంకరి తన మామను స్టిక్‌తో కొట్టడానికి కారణం ఏమిటో ఇంకా తెలియలేదు. తీవ్ర గాయాలపాలైన పద్మనాభాన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉమను అరెస్టు చేశారు. ఉమాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.