కుమార్తెను హత్య చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న త‌ల్లి

కర్ణాటకలోని శివమొగ్గలో 38 ఏళ్ల మహిళ తన 12 ఏళ్ల కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన విషాద వార్త వెలువడింది.

By -  Medi Samrat
Published on : 3 Oct 2025 5:43 PM IST

కుమార్తెను హత్య చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న త‌ల్లి

కర్ణాటకలోని శివమొగ్గలో 38 ఏళ్ల మహిళ తన 12 ఏళ్ల కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన విషాద వార్త వెలువడింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సుల క్వార్టర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసిన మృతురాలు శృతి భర్త రాత్రి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరవలేదు. ఆ తర్వాత ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు పగులగొట్టి చూడగా వారి కూతురు పూర్విక తలకు తీవ్రగాయాలై మృతి చెందింది. అతని భార్య శృతి మృతదేహం ఉరికి వేలాడుతూ ఉంది. శ్రుతి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ప్రాథమిక దర్యాప్తు నివేదిక వెల్లడించింది. పోలీసులు హత్య, అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై విచారణ ప్రారంభించబడింది.

Next Story