కర్నాటకలోని కల్బుర్గిలో రద్దీగా ఉండే మార్కెట్‌లో స్థానికులను కత్తితో దాడి చేస్తానని బెదిరించిన వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. నల్ల చొక్కా, ప్యాంటు ధరించి కల్బుర్గి మార్కెట్ మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తిని ఆదివారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించే సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలం వద్ద గుమిగూడారు. తీవ్ర ఉద్రిక్తత తర్వాత, అతని కాలిని పోలీసులు కాల్చారు. అతను నేలపై కుప్పకూలిపోవడంతో, పోలీసులు అతడిని పట్టేసుకున్నారు.
"మార్కెట్ సమీపంలో ఒక దుండగుడు ప్రజలపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని ఆపి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతను మా పోలీసు సిబ్బందిపై కూడా దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం, ప్రజల భద్రత కోసం, పోలీసులు దుండగుడిని కాల్చారు" అని కల్బురగి సిటీ పోలీస్ కమిషనర్ చేతన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి జాఫర్ అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.