భార్య ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న భర్త
కర్ణాటకలోని బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 24 Jan 2025 9:31 AM ISTకర్ణాటకలోని బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. బెంగళూరులోని నాగర్‌భావి ప్రాంతంలో గురువారం ఓ భర్త తన భార్య ఇంటి ముందు నిప్పంటించుకున్నాడు. ఆ వ్యక్తి భార్య విడాకుల పిటిషన్‌ను దాఖలు చేసింది.. దాని కారణంగా ఇద్దరి మధ్య వివాదం ఉంది. విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని భర్త భార్యను కోరినప్పటికీ భార్య వినలేదు.
మృతుడైన భర్త కుణిగల్ పట్టణానికి చెందిన మంజునాథ్ (39)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడు క్యాబ్ యజమాని. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజునాథ్‌కు 2013లో వివాహమై వివాహానంతరం బెంగళూరులోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్లుగా విడివిడిగా జీవించడంతోపాటు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
అయితే కోర్టులో విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని మంజునాథ్ తన భార్య ఇంటికి వచ్చాడు. అతని ప్రతిపాదనను భార్య స్పష్టంగా తిరస్కరించింది. అతనితో చాలా గందరగోళానికి గురైనట్లు అతని ముఖం మీద చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆమె అంగీకరించకపోవడంతో పెట్రోల్ డబ్బాతో ఆమె ఇంటి కారిడార్ వద్దకు వచ్చి నిప్పంటించుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. తమ కుమారుడి మృతికి భార్యే కారణమని మంజునాథ్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు జ్ఞానభారతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.