బెట్టింగ్ లో ఒకటిన్నర కోటి పోగొట్టుకున్న భ‌ర్త‌.. ప్రాణాలు తీసుకున్న భార్య

కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో రూ. 1.5 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతని భార్య ఆత్మహత్య చేసుకుంది.

By Medi Samrat  Published on  26 March 2024 7:00 PM IST
బెట్టింగ్ లో ఒకటిన్నర కోటి పోగొట్టుకున్న భ‌ర్త‌.. ప్రాణాలు తీసుకున్న భార్య

కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో రూ. 1.5 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న మహిళ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె అప్పు ఇచ్చిన వ్యక్తుల నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనేదని.. వారు తరచుగా తమ డబ్బు కోసం ఇళ్లకు వస్తూ ఉండడంతో చాలా బాధపడిపోయిందని మహిళ తండ్రి వాపోయారు.

దర్శన్-రంజిత 2020లో వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత, అతని కుమార్తె రంజిత తన భర్త దర్శన్ క్రికెట్ బెట్టింగ్‌ వేస్తున్నట్లు గుర్తించింది. అప్పు ఇచ్చిన వారు తరచూ.. ఆమె ఇంటికి వచ్చి డబ్బులు అడిగేవారు. దీంతో భార్యాభర్తల మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి. రంజిత మానసికంగా వేధింపులకు గురైంది.. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దర్శన్ బాబు వృత్తి రీత్యా అసిస్టెంట్ ఇంజనీర్ మరియు నీటిపారుదల శాఖలో పనిచేశాడు. దర్శన్ 12 మందికి పైగా రుణదాతల నుండి 84 లక్షల రూపాయలను తీసుకున్నాడు. అయితే క్రికెట్ బెట్టింగ్‌లో సర్వం కోల్పోయాడు. బెట్టింగ్‌లో భాగంగా ఖాళీ చెక్కులు కూడా ఇచ్చాడని తేలింది. పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 306 కింద ఫిర్యాదు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు రుణదాతలను అరెస్టు చేశారు.

Next Story