తుపాకీతో కాల్చుకుని వ్యక్తి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో బీజేపీ ఎమ్మెల్యే పేరు..
Karnataka man kills himself, names BJP MLA in suicide note. జనవరి 1న బెంగళూరు శివార్లలో 47 ఏళ్ల వ్యక్తి తన కారులో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడని ఆరోపణలు వచ్చాయి.
By M.S.R Published on 2 Jan 2023 11:43 AM GMTజనవరి 1న బెంగళూరు శివార్లలో 47 ఏళ్ల వ్యక్తి తన కారులో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడని ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, మరో ఐదుగురు తనను మోసం చేశారని మృతుడు సూసైడ్ నోట్‌లో రాశాడని పోలీసులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని నేతిగెరు గ్రామం సమీపంలో నిలిపివుంచిన కారులో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సూసైడ్ నోట్‌లో బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఆరుగురు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. తనను మానసికంగా హింసించడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు నోట్‌లో పేర్కొన్నారు. వ్యాపారవేత్త ఎస్ ప్రదీప్ ఆదివారం రాత్రి నేతిగెరె గ్రామం సమీపంలో తన కారులో నుదుటిపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలితో పాటు ఆరుగురు వ్యక్తులు తనను మానసికంగా వేధిస్తున్నారని, తన ఆత్మహత్యకు వారే బాధ్యులని సూసైడ్ నోట్‌లో మృతుడు తెలిపాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపి, సోమయ్య సూచనల మేరకు 2018 లో బెంగళూరులోని ఓ క్లబ్‌లో ప్రదీప్ రూ.1.2 కోట్లు పెట్టుబడి పెట్టాడు. క్లబ్‌లో పనిచేసినందుకు జీతంతో పాటు ప్రతి నెలా రూ.3 లక్షలు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. చాలా నెలలుగా డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. తన పెట్టుబడి తిరిగి ఇచ్చేందుకు కూడా నిరాకరించారు. ఆయన గోపి, సమ్మయ్యల విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే అరవింద్ లింబావలి దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే వారిని పిలిపించి మాట్లాడగా.. రూ.90 లక్షలు ఇచ్చేందుకు వారు అంగీకరించారు. అయినప్పటికీ తనకు డబ్బులు ఇవ్వకపోగా ఎమ్మెల్యే అండ చూసుకుని తనను మానసికంగా వేధించారని సూసైడ్ నోట్ లో ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రదీప్, తన భార్య కుటుంబంతో కలిసి కగ్గలిపుర సమీపంలోని వుడ్రోస్ రిసార్ట్ నుండి తిరిగి వస్తుండగా సాయంత్రం 5.30 గంటలకు లైసెన్స్ ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కగ్గలిపుర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతని భార్య నమిత తన బంధువుల కారులో ఉంది. బెంగళూరుకు 32 కిలోమీటర్ల దూరంలోని నెట్టిగెరెలో ప్రదీప్ తన కారులో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతను ఎనిమిది పేజీల సూసైడ్ నోట్‌ను రాసినట్లు పోలీసులు తెలిపారు.