రివాల్వర్‌తో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై అత్యాచారం.. కేసు నమోదు
ఖాకీ యూనిఫామ్ అంటే అందరికీ నమ్మకం, విశ్వాసం. ఆపదలో ఉన్నామంటే మేమున్నామంటూ ముందు వచ్చి సహాయం చేస్తారని.. ఆ విధంగా చాలామంది ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Jun 2024 12:00 PM ISTఖాకీ యూనిఫామ్ అంటే అందరికీ నమ్మకం, విశ్వాసం. ఆపదలో ఉన్నామంటే మేమున్నామంటూ ముందు వచ్చి సహాయం చేస్తారని.. ఆ విధంగా చాలామంది ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నారు.. కానీ కొంతమంది కీచక పోలీసుల వల్ల ఆ శాఖకు చెడ్డ పేరు వస్తుంది.. ఇటువంటి ఓ కీచక పోలీస్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన స్టేషన్‌లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ ను ఎస్సై రివాల్వర్ తో బెదిరింపులకు గురిచేసి అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. బాధిత మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ ఎస్సైను అధికారులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం సబ్ డివిజన్‌లోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో భవాని సేన్ ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఆయనకు గత కొద్ది రోజుల క్రితం కాలికి దెబ్బ తగిలింది. దీంతో అతడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో తనకు సేవలు చేయడానికి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి వచ్చిన మహిళా కానిస్టేబుల్‌కి తుపాకి చూపించి బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకితో చంపేస్తానని బెదిరింపులకు కూడా గురి చేశాడు. ఇలా పలుమార్లు ఆ మహిళ హెడ్ కానిస్టేబుల్ పై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆ మహిళ ఎవరికీ చెప్పుకోలేక లోలోపల వేదన భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి నిన్న రాత్రి సమయంలో కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి భవాని సేన్‌ను అదుపులోకి తీసుకుని మహాదేవపూర పోలీస్ స్టేషన్‌లో విచారించారు. పోలీసులు కీచక ఎస్సై పై లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఆర్టికల్ 311 ప్రకారం ఎస్‌ఐ భవానీ సేన్ ను సర్వీసు నుంచి తొలగించారు.