దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ జడ్జి భార్య ఆమె సోదరుడి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాకేత్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి భార్య మృతదేహం దగ్గర మూడు సూసైడ్ నోట్‌లు కూడా లభించాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదనపు సెషన్స్ జడ్జి భార్య మిస్సింగ్ అంటూ అర్థరాత్రి సాకేత్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడింది. ఈ కేసులో దర్యాప్తు తర్వాత, రాజ్‌పూర్ ఖుర్ద్‌లోని తన సోదరుడి ఇంట్లో 42 ఏళ్ల మహిళ ఉరి వేసుకున్నట్లు కనుగొనబడింది. మృతదేహం దగ్గర మూడు సూసైడ్ నోట్‌లు లభ్యమయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
సాకేత్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి పేరు అశోక్ బెనివాల్ కాగా.. అతని భార్య అనుపమ బేనివాల్ తన సోదరుడి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మే 28న తన భార్య అనుపమ ఇంటి నుంచి కనిపించకుండా పోయిందని జడ్జి బేనీవాల్ పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. వీటన్నింటి తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, శుక్రవారం అర్థరాత్రి తన సోదరుడి ఇంట్లో ఆమె ఉరివేసుకుని కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారిస్తున్నారు.