శివరాత్రి వేళ నల్గొండలో విషాదం..BMW బైక్ ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మృతి

నల్గొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

By -  Knakam Karthik
Published on : 15 Feb 2026 6:56 PM IST

Road Accident, Crime News, Telangana, Nalgonda, Chityala, Bike Accident, Bike Riding Tragedy

శివరాత్రి వేళ నల్గొండలో విషాదం..BMW బైక్ ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మృతి

అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సరదాగా సాగాల్సిన బైక్ రైడింగ్ ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. నల్గొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన రితీష్ రెడ్డి అనే యువకుడు బైక్ రైడింగ్ అంటే మక్కువతో, మరో 30 మంది రైడర్లతో కలిసి గత శనివారం హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల బీచ్‌కు రైడింగ్‌కు వెళ్లారు. అక్కడ పర్యటన ముగించుకుని, ఆదివారం తిరిగి తన రూ. 25 లక్షల విలువైన BMW లగ్జరీ బైక్‌పై హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో బైక్ అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. బైక్ వేగం ఎక్కువగా ఉండటంతో రితీష్ రెడ్డి గాల్లోకి ఎగిరి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ మరియు ఇతర సేఫ్టీ గేర్లు ఉన్నప్పటికీ, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో రితీష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు

Next Story