జర్నలిస్ట్ కేశవను హత్య చేసిన గుట్కా మాఫియా

Journalist Murdered In Kurnool. గుట్కా మాఫియా ఓ జర్నలిస్టును అత్యంత కిరాకతంగా హత్య చేసింది. ఓ ముఠా సాగిస్తున్న

By Medi Samrat  Published on  9 Aug 2021 11:50 AM IST
జర్నలిస్ట్ కేశవను హత్య చేసిన గుట్కా మాఫియా

గుట్కా మాఫియా ఓ జర్నలిస్టును అత్యంత కిరాకతంగా హత్య చేసింది. ఓ ముఠా సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలను ప్రసారం చేయించడంతో అతడిని మట్టుబెట్టింది ఆ గ్యాంగ్. కర్నూలు జిల్లా నంద్యాలలో జర్నలిస్ట్ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి జర్నలిస్ట్‌ కేశవను హత్య చేశారు దుండగులు. కేశవ ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల సస్పెండ్‌ అయిన కానిస్టేబుల్‌ హత్య చేయించాడని కేశవ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో జర్నలిస్టుగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో కేశవ పని చేస్తున్నాడు. నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్య దురాగతాల పై తన యూట్యూబ్ ఛానల్ లో వార్త రాశాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారట..! ఎస్పీ సస్పెండ్ చేయడానికి కేశవ అందించిన కథనాలేనని.. అందుకే పగ బట్టి కేశవను హత్య చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్జీవో కాలనీ లో హాస్టల్ దగ్గర ఉండగా కానిస్టేబుల్ సుబ్బయ్య అతని సోదరుడు నాని ఇద్దరు వచ్చి స్క్రూ డ్రైవర్ తో కడుపులో పొడిచి గాయపరిచి పారిపోయారని కేశవ స్నేహితులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన కేశవను ఆస్పత్రికి తరలించగా కాసేపటికే మృతిచెందినట్లు అతని సన్నిహితులు.. ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.

కేశవ తోటి రిపోర్టర్‌ ప్రతాప్‌తో కలిసి ఎన్జీవోస్‌ కాలనీకి వెళ్లాడట.. అక్కడ కేశవతో ప్రత్యేకంగా మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని గదిలోకి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలకే ఆ గదిలోంచి గట్టిగా కేకలు వినిపించటంతో ప్రతాప్‌ వెళ్లాడు. అక్కడ తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అప్పటికే కేశవ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు వైద్యులు తెలిపారు.


Next Story