బాలికలకు అశ్లీల వీడియోలు చూపించిన టీచర్.. సిరా పూసి చెప్పులు తొడిగిన గ్రామస్థులు

Jharkhand villagers blacken teachers face for showing porn to girl. పాఠశాల తరగతి గదిలో బాలికలకు అశ్లీల వీడియోలు చూపించి, అసభ్యంగా ప్రవర్తించాడో ఉపాధ్యాయుడు.

By అంజి  Published on  30 Sept 2022 3:48 PM IST
బాలికలకు అశ్లీల వీడియోలు చూపించిన టీచర్.. సిరా పూసి చెప్పులు తొడిగిన గ్రామస్థులు

పాఠశాల తరగతి గదిలో బాలికలకు అశ్లీల వీడియోలు చూపించి, అసభ్యంగా ప్రవర్తించాడో ఉపాధ్యాయుడు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడి ముఖంపై సిరా పూసి, చెప్పులతో దండలు వేసి ఉరంతా తిప్పారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల నుంచి నిందితుడిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా నిందితుడిని వెంటనే జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నోవాముండి బ్లాక్‌లోని మిడిల్ స్కూల్‌లో చదువుతున్న ఆరుగురు బాలికలు పాఠశాల ఉపాధ్యాయుడు తమకు అసభ్యకరమైన వీడియో చూపించి, తమ రొమ్ములను తాకినట్లు వారి తల్లిదండ్రులకు చెప్పారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బుధవారం నిందితుడిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ గ్రామస్తులే స్వయంగా సమావేశం నిర్వహించి నిందితుడిపై చర్యలు తీసుకున్నారు.పెద్ద సంఖ్యలో మహిళలు నిందితుడిని పట్టుకుని ముఖానికి సిరా పూసి చెప్పుల మాల వేశారు.

అతన్ని బడ్జమడ ప్రాంతంలో ఉరేగింపు చేస్తుండగా, సమీపంలోని రైల్వే స్టేషన్ వైపు తీసుకువెళుతుండగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షించారు. గంటల తరబడి నిరసన తెలిపిన మహిళలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (కిరిబూరు) వీరేంద్ర ఎక్కా శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు బద్దజమడ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ అధికారి బాసుదేవ్‌ టోప్పో తెలిపారు.

Next Story