అస్థిపంజరం మాత్రమే మిగిలింది.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుబ సభ్యులు
జైపూర్‌లో జరిగిన ట్యాంకర్‌లో మంటలు చెలరేగిన ఘటనలో పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్రా గ్రామానికి చెందిన 24 ఏళ్ల డ్రైవర్ కూడా ఉన్నాడు.
By Medi Samrat Published on 22 Dec 2024 9:45 AM GMTజైపూర్‌లో జరిగిన ట్యాంకర్‌లో మంటలు చెలరేగిన ఘటనలో పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్రా గ్రామానికి చెందిన 24 ఏళ్ల డ్రైవర్ కూడా ఉన్నాడు. ప్రమాద వార్త తెలియగానే బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు కొందరు జైపూర్‌కు చేరుకోగా..డ్రైవర్‌కు చెందిన కాలిపోయిన అస్థిపంజరం మాత్రమే కనిపించింది. డీఎన్‌ఏ శాంపిల్స్ తీసిన తర్వాత స్థానిక పోలీసులు అస్థిపంజరాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో మృతుడి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
24 ఏళ్ల లాలూ యాదవ్.. పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్ర గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు కంటైనర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం ఐదు రోజుల క్రితమే ఇంటి నుంచి కంటైనర్ వద్దకు వెళ్లాడు. జైపూర్ నుంచి కారును కంటైనర్‌లో ఎక్కించుకుని ఢిల్లీ వెళ్తున్నాడు. ఆ సమయంలోనే గ్యాస్ ట్యాంకర్ ఢీకొన్న ఘటన జరిగింది. దీంతో మంటలు చెలరేగాయి. ట్యాంకర్ తర్వాత లాలూకు చెందిన కంటైనర్ నాలుగు-ఐదు వాహనాలు వెనుకే ఉంది. దీంతో మంటలు చెలరేగడంతో కంటైనర్‌లోకి కారుతో సహా పూర్తిగా దగ్ధమైంది. ఆ మంటల్లోనే లాలూ కూడా సజీవ దహనమయ్యాడు. వాహనంలో కాలిపోయిన మూడు మగ అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో లాలూ అస్థిపంజరం కూడా లభ్యమైంది. జైపూర్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న బంధువుల్లో కలకలం రేగింది.
బంధువులు జైపూర్‌కు చేరుకున్నారు. జైపూర్ పోలీసులు DNA నమూనా తీసిన తర్వాత అస్థిపంజరాన్ని బంధువులకు అప్పగించారు. బంధువుల ప్రకారం.. నలుగురు సోదరులలో లాలూ మూడవవాడు. జైపూర్-అజ్మీర్ హైవేపై కెమికల్ ట్యాంకర్ పేలుడు సంభవించడంతో పలువురు సజీవదహనమయ్యారు. శుక్రవారం ఉదయం రసాయనాలు నింపిన ట్రక్కు మరో ట్రక్కును ఢీకొని మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.