అపార్ట్‌మెంట్‌లో లివ్-ఇన్ పార్ట్ నర్ మృతదేహం.. IRS అధికారి అరెస్టు

నోయిడాలో మహిళ మృతికి సంబంధించి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారిని అరెస్టు చేశారు. మే 25 సాయంత్రం నోయిడా సెక్టార్-100లోని లోటస్ బౌలేవార్డ్ సొసైటీలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

By Medi Samrat  Published on  28 May 2024 1:15 PM IST
అపార్ట్‌మెంట్‌లో లివ్-ఇన్ పార్ట్ నర్ మృతదేహం.. IRS అధికారి అరెస్టు

నోయిడాలో మహిళ మృతికి సంబంధించి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారిని అరెస్టు చేశారు. మే 25 సాయంత్రం నోయిడా సెక్టార్-100లోని లోటస్ బౌలేవార్డ్ సొసైటీలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. విచారణలో ఐఆర్ఎస్ అధికారి సౌరభ్ మీనాకు శిల్పా గౌతమ్ అనే మహిళతో మూడేళ్లుగా సంబంధం ఉందని, వారు సహజీవనం చేస్తున్నారని గుర్తించారు. శిల్ప భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)కి డిప్యూటీ మేనేజర్‌గా పని చేయగా, సౌరభ్ ఆదాయపు పన్ను శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు.


పోలీసులు శిల్ప తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు ఈ మరణం వెనుక సౌరభ్ ఉన్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకోమని శిల్ప సౌరభ్‌ను అడిగేదని, ఈ కారణంగా వారి మధ్య తరచూ గొడవలు జరిగేవని అన్నారు. సౌరభ్ ఆమెను కొట్టేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సౌరభ్‌ను అరెస్టు చేశారు.

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో సౌరభ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు. మే 25, శనివారం సాయంత్రం లోటస్ బౌలేవార్డ్ సొసైటీలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ మిశ్రా తెలిపారు. "పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు. మహిళ కుటుంబీకుల ఫిర్యాదు ఆధారంగా, సౌరభ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది," అని మనీష్ కుమార్ తెలిపారు.

Next Story