'తుపాకీతో కాల్చి చంపేయ్.. కానీ అత్యాచారం చేయకు'
'Instead of rape shoot me' pleads the victim girl.ప్రియుడిని కలిసేందుకు ఓ యువతి పార్క్‌కు వెళ్లగా
By తోట వంశీ కుమార్ Published on 17 Feb 2023 3:27 AM GMTఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రియుడిని కలిసేందుకు ఓ యువతి పార్క్‌కు వెళ్లగా.. అక్కడ ఓ వ్యక్తి గన్ చూపించి యువతిపై అత్యాచారానికి యత్నించాడు. తుపాకీతో కాల్చి చంపేయ్ కానీ.. అత్యాచారం మాత్రం చేయకు అంటూ ఆ యువతి దుండగుడితో పోరాడింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
ఫ్లోరిడాలోని ఓ పార్క్‌లో తన ప్రియుడిని కలుసుకునేందుకు ఓ యువతి వెళ్లింది. ప్రియుడు కోసం ఆ యువతి వేచి చూస్తుండగా ఇంతలో 29 ఏళ్ల డోనోవన్ టైలర్ అడ్కిన్స్ అనే వ్యక్తి ఆ యువతి వద్దకు వచ్చాడు. గన్ చూపించి యువతిని బెదిరించి చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ యువతిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
తొలుత అతడి ప్రవర్తన చూసి భయపడిన యువతి తేరుకుని అతడితో పోరాడింది. ముందు నన్ను కాల్చు. అంతేగానీ అత్యాచారం మాత్రం చేయకు అంటూ ఏడుస్తూ అడిగింది. అదే సమయంలో ఆమె ప్రియుడు అక్కడకు వచ్చాడు. ఆమె కేకలు విని ఘటనాస్థలానికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే అడ్కిన్స్ భయాందోళనకు గురై అక్కడి నుంచి పారిపోయాడు.
వెంటనే బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితురాలు జరిగిన విషయాన్ని మొత్తం వివరించింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ తర్వాత అడ్కిన్స్‌ని అరెస్టు చేశారు. అతనిపై గూండాయిజం, అత్యాచార యత్నం సహా అరడజను ఇతర నేరాలకు సంబంధించి కేసులను నమోదు చేశారు.
అడ్కిన్స్ బాధితురాలిని తుపాకీతో అడవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని బ్రెవార్డ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. బట్టలు విప్పి తుపాకీ చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే బాలిక కేకలు విన్న ప్రియుడు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే అడ్కిన్స్ భయాందోళనకు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం అడ్కిన్స్ బ్రెవార్డ్ కౌంటీ జైలులో ఉన్నాడు. అతడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు.