లూథియానా పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జస్నీత్ కౌర్ అలియాస్ రాజ్‌బీర్ కౌర్‌ను బ్లాక్‌మెయిలింగ్, దోపిడీ ఆరోపణలపై అరెస్టు చేశారు. కౌర్ తన సోషల్ మీడియా స్నేహితులను బ్లాక్ మెయిల్ చేస్తోందని పోలీసులు తెలిపారు. లూథియానా (పశ్చిమ) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ జస్రూప్ కౌర్ బాత్ ఈ అరెస్టును ధృవీకరించారు. కౌర్ కు సహాయం చేస్తున్న లక్కీ సంధుపై కూడా పోలీసులు అభియోగాలు మోపారు.
“నిందితులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని స్థానిక వ్యాపారవేత్త నుండి మాకు ఫిర్యాదు వచ్చింది. నిందితులు బాధితులకు బెదిరింపులకు పాల్పడ్డారు. కొందరు గూండాల సహాయంతో కూడా బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ధృవీకరిస్తున్నాము” అని బాత్ చెప్పారు. కౌర్‌పై ఏప్రిల్ 1 న లూథియానాలోని మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమె వద్ద ఉన్న బీఎండబ్ల్యూ కారు, మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కౌర్‌ను కోర్టు ముందు హాజరుపరచగా, ఆమెకు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.