32 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..!

Instagram Friend Rapes Married Woman On Pretext Of Marriage. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో 32 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు

By M.S.R  Published on  8 April 2023 8:30 PM IST
32 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..!

మహారాష్ట్రలోని పూణె జిల్లాలో 32 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు వివిధ కారణాలతో మహిళ నుంచి రూ.5 లక్షలకు పైగా బంగారం, బంగారం లాగేసుకున్నాడు. మహిళకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. నగ్న ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపుతానని నిందితుడు మహిళను బెదిరించాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఆ మహిళకు మే 2021 నుండి ఆ వ్యక్తితో పరిచయం అయింది. నిందితుడు మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా వాసి. బాధితురాలు రోజూ ఆ వ్యక్తితో మాట్లాడటం ప్రారంభించింది, సన్నిహితంగా కూడా ఉన్నారు. ఆ వ్యక్తి ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని కూడా మాట ఇచ్చాడు. నిందితుడు వివిధ కారణాలు చెప్పి డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, తన నగ్న ఫొటోలు కూడా తీశాడని బాధిత మహిళ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Next Story