మేకలను మేపడానికి వెళ్లిన బాలికపై అత్యాచారం
9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో వెలుగు చూసింది
By Medi Samrat Published on 24 Sept 2024 3:33 PM IST9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో వెలుగు చూసింది. ఈ కేసులో అత్యాచారం ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం జరిగిన సంఘటన తరువాత.. నాగరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామం వెలుపల ఉన్న వ్యవసాయ పొలంలో బాలిక అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె తన ఇంట్లో ఉన్న మేకలను మేపడానికి వెళ్ళింది.
ఈ విషయంపై మోరీనా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. బాలికను జిల్లా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చేర్చామని.. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అనంతరం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి మంగళవారం ఉదయం 5 గంటలకు 28 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు ప్రకటన తెలిపింది.
బాధితురాలు పొలంలో అపస్మారక స్థితిలో కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను పోర్సాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ నుండి ఆమెను జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. దీంతో బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన గురించి సోమవారం సాయంత్రం 6 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. పిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయబడింది.