శవ పరీక్ష చేస్తే ఊపిరితిత్తులు, కడుపులో నీరు లేదు.. తల్లి చేసిన దారుణమా.?

దక్షిణ ఫ్లోరిడాలో తన నాలుగేళ్ల కుమార్తెను హత్య చేసిందనే ఆరోపణలతో భారత సంతతికి చెందిన వైద్యురాలు నేహా గుప్తా అరెస్టు అయ్యారు.

By Medi Samrat
Published on : 3 July 2025 7:22 PM IST

శవ పరీక్ష చేస్తే ఊపిరితిత్తులు, కడుపులో నీరు లేదు.. తల్లి చేసిన దారుణమా.?

దక్షిణ ఫ్లోరిడాలో తన నాలుగేళ్ల కుమార్తెను హత్య చేసిందనే ఆరోపణలతో భారత సంతతికి చెందిన వైద్యురాలు నేహా గుప్తా అరెస్టు అయ్యారు. జూన్ 27న తన కుమార్తె మరణానికి సంబంధించి ఓక్లహోమా నగరానికి చెందిన 36 ఏళ్ల నేహాను అరెస్టు చేశారు. ఆమె తన కుమార్తె మృతిని ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంగా చూపించినట్లు మయామి-డేడ్ షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది. ఆమె ఇంకా కస్టడీలోనే ఉంది.

ఆమె తన కుమార్తె ఆరియా తలతితో కలిసి మయామిలోని ఎల్ పోర్టల్ గ్రామంలో సెలవులను గడుపుతూ ఉంది. జూన్ 27న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఆమె 911కి డయల్ చేసి, కుమార్తె అద్దె ఇంటిలోని కొలనులో మునిగిపోవడం గురించి తెలియజేసిందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది 4 ఏళ్ల చిన్నారిని స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు తీసి, CPR ఇవ్వడం ప్రారంభించారు. ఆమెను జాక్సన్ మెమోరియల్ హాస్పిటల్‌లోని రైడర్ ట్రామా సెంటర్‌కు తరలించారు, అక్కడ ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. కుమార్తెతో కలిసి భోజనం చేసాక నిద్రపోయానని చెప్పిన నేహా, ఆ తర్వాత కొన్ని గంటలకు మెలకువ వచ్చాక చూస్తే స్విమ్మింగ్ పూల్ లో తన కుమార్తె ఉందని తెలిపింది.

జూన్ 29న మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం చిన్నారి ఆరియాకు శవపరీక్ష నిర్వహించింది. చిన్నారి ఊపిరితిత్తులు, కడుపులో నీరు లేదని, మునిగిపోవడం మరణానికి కారణమని తోసిపుచ్చుతూ నివేదిక తెలిపింది. ప్రస్తుతం నేహా గుప్తా హత్య అభియోగాలని ఎదుర్కొంటుందని అధికారులు తెలిపారు.

Next Story