పెళ్లైన పది రోజులకే మాపై కేసు పెట్టింది
బెంగళూరులో ఇంజనీర్ అతుల్ సుభాష్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మగవాళ్లను బూటకపు కేసుల్లో ఇరికించి మానసికంగా హింసిస్తున్నారని, డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.
By Medi Samrat Published on 9 Jan 2025 4:37 PM ISTప్రతీకాత్మక చిత్రం
బెంగళూరులో ఇంజనీర్ అతుల్ సుభాష్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మగవాళ్లను బూటకపు కేసుల్లో ఇరికించి మానసికంగా హింసిస్తున్నారని, డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వీడియోను హైదరాబాద్ వాసి ప్రత్యూష చల్లా షేర్ చేశారు. ఈ వీడియోలో తన సోదరుడి వివాహం జరిగి కేవలం 10 రోజులు మాత్రమే గడిచిందని.. అప్పుడే మా కుటుంబంపై తన అన్న భార్య సెక్షన్ 498 కింద ఫేక్ కేసు పెట్టిందని ఆరోపించింది.
ప్రత్యూష ఐఐటీ గాంధీనగర్, ఐఐఎం అహ్మదాబాద్ పాసౌట్ స్టూడెంట్. ఆమె ఓ వీడియోను రికార్డ్ చేసి యూట్యూబ్‌లో షేర్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రత్యూష వీడియోలో తన అన్న భార్య తమ కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేస్తోందని తెలిపింది.
తన సోదరుడు హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడని.. అతడికి రాజమండ్రికి చెందిన అమ్మాయితో 2019లో వివాహమైంది. కానీ ఈ వివాహం కేవలం 10 రోజులు మాత్రమే కొనసాగింది. నా తల్లిదండ్రులతో ఆమె దురుసుగా ప్రవర్తించేది. నా సోదరుడిని తన సొంత పడకగదిలోకి ప్రవేశించడానికి అనుమతించకపోయేది. ఆత్మహత్య చేసుకుంటానని చాలాసార్లు బెదిరించింది. వదిన, ఆమె సోదరి, ఆమె సోదరుడు, ఆమె ప్రియుడు మా నుంచి డబ్బు లాగడానికి ప్లాన్ చేశారు. ఆమె సోదరి కూడా తన అత్తమామల ఇంట్లో అలాగే చేసింది. పెళ్లైన 10 రోజుల తర్వాత ఆమె మా ఇంటి నుంచి వెళ్లిపోయింది. మాపై కేసులు పెట్టింది. మాకు తెలియకుండానే ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఐదేళ్ల నుంచి ఆరోపణలు చేస్తున్నారని.. తన కుటుంబం మాత్రం ఇప్పటికీ ఆ టార్చర్ సహిస్తూనే ఉందని.. ఇది జరిగి ఐదేళ్లు కావస్తున్నా కేసు విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. ఇది మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేయడంతోపాటు నా తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఈ పెండింగ్ కేసు వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని.. అద్భుతమైన విద్యార్హతలు ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం పొందలేకపోయానని ప్రత్యూష తెలిపింది. ఈ వీడియో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చిన్న వీడియో:
— తెలుగు ప్రవచనాలు (@Pravachanaalu) January 5, 2025
పెళ్లి అంటే భయం వేస్తుంది !
False cases పెట్టిన వారు మీద strict action ఉండాలి!
Full video https://t.co/oEJrHdvP44 pic.twitter.com/h2pYp7XLX7