నన్ను 'వర్చువల్' గా గ్యాంగ్ రేప్ చేశారు
'I was gang-raped in a virtual manner...' alleges woman. భౌతిక ప్రపంచం, వర్చువల్ ప్రపంచం కలయికతో రూపొందించబడింది మెటావర్స్.
By Medi Samrat Published on 5 Feb 2022 4:59 PM IST
భౌతిక ప్రపంచం, వర్చువల్ ప్రపంచం కలయికతో రూపొందించబడింది మెటావర్స్. ఇటీవలి కాలంలో దీనిపై బాగా చర్చ జరుగుతోంది. ప్రతిదీ వాస్తవంగా జరుగుతున్నట్లు అనిపించే డిజిటల్ ప్రదేశం మెటావర్స్. ఇందులో ఒక మహిళ సైన్ అప్ చేయగా ఆమె 60 సెకన్లలో సామూహిక అత్యాచారానికి గురైంది. మెటావర్స్ వినియోగదారులచే వర్చువల్ గా సామూహిక అత్యాచారం: మీడియా నివేదికల ప్రకారం, 43 ఏళ్ల మహిళ తన అవతార్(మనిషిని పోలిన డిజిటల్ ఇమేజ్) ను లైంగికంగా దోపిడీ చేశారని, మెటావర్స్‌లోని ఇతర వినియోగదారులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. నీనా జేన్ పటేల్ వర్చువల్ ప్రపంచంలోకి ప్రవేశించిన కొన్ని సెకన్లలోనే ఇదంతా జరిగిందని ఆరోపిస్తూ, మీడియం బ్లాగ్ లో తనపై జరిగిన దారుణాన్ని వివరించింది.
"మెటావర్స్‌లో చేరిన 60 సెకన్లలోపే, 3-4 మగ అవతార్ లు మగ గొంతులతో కూడా నన్ను మాటలతో లైంగికంగా వేధించారు" అని మహిళ దీని గురించి చెప్పింది. వారు నా అవతార్‌పై సామూహిక అత్యాచారం చేసి ఫోటోలు తీశారు. 43 ఏళ్ల మహిళ తన అవతార్‌పై మగ అవతారాల బృందం లైంగిక అత్యాచారం చేయడాన్ని తాను చూశానని చెప్పింది. వారు తన ఫోటోను కూడా క్లిక్ చేసి "మీకు నచ్చనట్లు నటించవద్దు" వంటి సందేశాలు ఇచ్చారు. ఆ తర్వాత, ఆమె వెంటనే తన హెడ్‌ఫోన్‌లను పగలగొట్టింది. అప్పటి నుండి భయపడుతూ ఉంది. మహిళ కబూని వెంచర్స్ అనే ఇమ్మర్సివ్ టెక్నాలజీ కంపెనీకి మెటావర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తోంది.