బ్రిటన్‌లో ఓ మహిళ తన మాజీ భర్తపై భయంకరమైన ఆరోపణ చేసింది. తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తన భర్త తనకు డ్రగ్స్ ఇచ్చాడని, కొన్నాళ్లుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళ ఆరోపించింది. ఇది మాత్రమే కాదు.. ఆమె మాజీ భర్త ఆమెకు అభ్యంతరకరమైన ఫోటోలు కూడా తీశాడు.
బాధితురాలు మాట్లాడుతూ.. తన మాజీ భర్త తనను వేధించాడని చాలా సులభంగా ఒప్పుకున్నాడు. "అవును, నేను నిన్ను రేప్ చేశాను. నేను మీకు మత్తుమందు ఇచ్చి, కొన్నాళ్ల పాటు రేప్ చేశాను.. నీ ఫోటోలు తీశాను" అని చెప్పాడని వెల్లడించింది.
చాలా ఏళ్లుగా తన మాజీ భర్త నేను తాగే టీలో నిద్రమాత్రలు కలుపుతూ తనను వేధిస్తున్నాడని బాధితురాలు చెప్పింది. నేను నిద్ర లేచి నువ్వు నాతో తప్పుగా ప్రవర్తించావని చెబితే.. కలలో అలా కనిపించిందని చెప్పేవాడని వివరించింది.
వేధింపుల గురించి బాధితురాలు తన సోదరికి చెప్పింది. అనంతరం వారిద్దరూ పోలీసులను సంప్రదించారు. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) ఈ కేసును విచారించింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడి, తెలిసి డ్రగ్స్ ఇచ్చినందుకు నిందితుడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది.