Hyderabad: బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. భార్య మృతి.. భర్తకు తీవ్రగాయాలు

హైదరాబాద్: బహదూర్‌పురాలోని తాడ్‌బన్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త గాయపడగా ఓ మహిళ మృతి చెందింది.

By అంజి  Published on  5 Feb 2024 8:17 AM IST
Hyderabad,  Woman killed, Crime news, Road accident

Hyderabad: బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. భార్య మృతి.. భర్తకు తీవ్రగాయాలు

హైదరాబాద్: బహదూర్‌పురాలోని తాడ్‌బన్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త గాయపడగా ఓ మహిళ మృతి చెందింది. కింగ్స్‌ కాలనీకి చెందిన బాధితురాలు బుష్రా ఫాతిమా (30) తన భర్త అహ్మద్‌ మొహియుద్దీన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌కు వెళ్తున్న వనపర్తి డిపోకు చెందిన టీఎస్‌ఆర్‌టీసీ బస్సు దంపతులను ఢీకొట్టింది. భార్యాభర్తలు రోడ్డుపై పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. బుష్రా ఫాతిమా అక్కడికక్కడే మృతి చెందింది.

సంఘటన జరిగిన వెంటనే టీఎస్‌ఆర్టీసీ డ్రైవర్ ర్యాష్‌గా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడని ఆరోపిస్తూ, అక్కడికి చేరుకున్న జనం టీఎస్‌ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు. బుష్రా ఫాతిమా మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బస్సును బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బహదూర్‌పురా జూ పార్క్ నుండి ఆరామ్‌గఢ్‌కు వెళ్లే రహదారిపై పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా రహదారి అధ్వాన్నంగా ఉందని పేర్కొనడం గమనార్హం. రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు, గోతులు ఏర్పడి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి.

Next Story