నెల్లూరులో హైద్రాబాద్‌కు చెందిన మహిళ సజీవ దహనం
Hyderabad woman burnt alive in Nellore. నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన
By Medi Samrat Published on
28 Jan 2022 5:13 AM GMT

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో హైద్రాబాద్‌కు చెందిన ఓ మహిళ సజీవ దహనమైన ఘటన సంభవించింది. హైదరాబాద్‌కు చెందిన మహిళ మానసిక అనారోగ్యంతో బాధపడుతూ దర్గాకు వచ్చినట్లు సమాచారం. దర్గా సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ మహిళ మృతిచెందింది. అయితే ఆమెతో పాటు వచ్చిన మరో మహిళ కూడా ఈ ప్రమాదంలో గాయపడింది. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని ఫాతిమాగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్గా సమీపంలో అగ్నిప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story