Hyderabad: రూ.2,50,000 లకు పసికందు విక్రయం.. 10 మంది అరెస్ట్‌

నవజాత శిశువును విక్రయించేందుకు ప్రయత్నించిన పది మంది ముఠా గుట్టు రట్టయింది. 15 రోజుల పసికందును రక్షించి సురక్షిత సంరక్షణ కోసం శిశు సంక్షేమ కేంద్రానికి అప్పగించారు.

By అంజి  Published on  24 Sept 2024 7:45 AM IST
Hyderabad, arrest, newborn, Crime, Baby kidnap, Chandrayanagutta

Hyderabad: రూ.2,50,000 లకు పసికందు విక్రయం.. 10 మంది అరెస్ట్‌

హైదరాబాద్: నవజాత శిశువును విక్రయించేందుకు ప్రయత్నించిన పది మంది ముఠా గుట్టు రట్టయింది. 15 రోజుల పసికందును రక్షించి సురక్షిత సంరక్షణ కోసం శిశు సంక్షేమ కేంద్రానికి అప్పగించారు.

షేక్ ఇస్మాయిల్, సుల్తానా బేగం, మెహదీ అలీ, ఫాతిమా రెహమ్త్, సయ్యద్ ఇంతియాజ్ పాషా, నజ్మా బేగం, ఫిరోజ్ ఖాన్, సయిదా షాహిక్‌, నఫీజ్‌ బేగమ్‌, సయీదా బేగు అనే 10 మందిని చాంద్రాయణగుట్ట పోలీసులతో పాటు సౌత్ జోన్ కమీషనర్ టాస్క్ ఫోర్స్ బృందం పట్టుకుంది. వీరు రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ వాసులు.

కేసు వివరాలు

కేసు రికార్డుల ప్రకారం.. ప్రధాన నిందితుడు మెహిదీ అలీ అలియాస్ సలీమ్ హైదరాబాద్ వాసి. డబ్బులు మరింత సంపాదించేందుకు, పిల్లలు లేని తల్లిదండ్రులకు నవజాత శిశువులను అక్రమంగా విక్రయించి, భారీ కమీషన్ తీసుకోవాలని పథకం పన్నాడు. అతను షేక్ ఇస్మాయిల్, సుల్తానా బేగంలను సంప్రదించి, వారి ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి వారి నవజాత శిశువును విక్రయించమని ప్రోత్సహించాడు.

అందుకు బాలుడి తల్లిదండ్రులు తమ బిడ్డకు రూ.2,50,000 అందించారు. తర్వాత సలీమ్ బ్రోకర్లు ఫాతిమా, రహమత్, సయ్యద్ ఇమ్తియాస్ పాషా, నజ్మా బేగం, ఫిరోజ్ ఖాన్, సయీదా షేక్, నఫీజా బేగం, సయీదా బేగంలను సంప్రదించి కస్టమర్లను సంప్రదించాడు. వారంతా వాట్సాప్ ద్వారా పాప ఫోటోను అమ్మకానికి పెట్టారు.

ఈ విక్రయాలపై పక్కా సమాచారం అందుకున్న కమీషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సౌత్ జోన్, చాంద్రాయణగుట్ట పోలీసులు చాంద్రాయణగుట్ట వద్ద ముఠాను అదుపులోకి తీసుకుని మగబిడ్డను రక్షించారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం ఎస్‌హెచ్‌ఓ చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. చంద్రయ్యగుట్ట పోలీసులు జేజే యాక్ట్ 2015 సెక్షన్ 80, 81 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story