మైనర్ బాలికను ముంబై వ్యక్తికి రూ. 3 లక్షలకు విక్రయించిన కేసులో తొమ్మిది మంది వ్యక్తులను బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని సయ్యద్ అల్తాఫ్ అలీ, అఖిల్ అహ్మద్, జరీనా బేగం, షబానా బేగం, షమీమ్ సుల్తానా, నస్రీన్ బేగం, జహైదా బేగం, అర్షియా బేగం, చాంద్ సుల్తానాగా తెలిపారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన అల్తాఫ్ అలీ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మరో యువతి కోసం వెతుకుతున్నాడు. అతను షాహీన్‌నగర్‌లోని ఖుబా కాలనీకి చెందిన బ్రోకర్ అఖిల్ అహ్మద్‌ను సంప్రదించాడు.
అతను అమ్మాయిని కనుగొనడంలో సహాయం కోరుతూ జరీనా, షబానా, షమీమ్, నస్రీన్ మరియు జహైదాలను సంప్రదించాడు. "అఖిల్ ఇతరుల సహాయంతో ఎర్రకుంటలో నివాసముంటున్న మైనర్ బాలికను గుర్తించి, రూ.3 లక్షలకు అమ్మేందుకు ఆమె తల్లిని ఒప్పించాడు. డీల్ కుదరడంతో అల్తాఫ్ అలీ ముంబయి నుంచి నగరానికి వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేసి వారిని అరెస్టు చేశారు'' అని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. వీరిపై ఐపీసీలోని పలు సెక్షన్‌ల కింద కేసు బుక్ చేయబడింది. అరెస్టు చేసిన వారందరినీ రిమాండ్‌కు తరలించారు.