Hyderabad: అప్పుడే పుట్టిన కూతురిని రూ.లక్షకు విక్రయించిన తండ్రి.. అరెస్ట్

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. నవజాత శిశువును లక్ష రూపాయలకు విక్రయించారు.

By అంజి  Published on  14 July 2024 4:25 PM IST
Hyderabad, newborn daughter, arrest, Crime

Hyderabad: అప్పుడే పుట్టిన కూతురిని రూ.లక్షకు విక్రయించిన తండ్రి.. అరెస్ట్

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. నవజాత శిశువును లక్ష రూపాయలకు విక్రయించారు. ఈ కేసుకు సంబంధించి పసికందు తండ్రి సహా ముగ్గురిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫ్ అనే వ్యక్తి తన బిడ్డను తెలిసిన వారికి రూ.లక్షకు విక్రయించాడని పోలీసులు తెలిపారు. చిన్నారి తల్లి అస్మాబేగం ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. దీంతో చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

18 రోజుల చిన్నారిని 24 గంటల్లో రక్షించారు. చిన్నారిని బండ్లగూడలోని తన తల్లి అస్మా బేగం వద్దకు చేర్చారు. హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్ ఆస్మాను బెదిరించి, తెలిసిన వారికి బిడ్డను విక్రయించాడు. ఈ విషయం బయట చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఉంటాయని బెదిరింపులకు గురి చేశాడు. ఆసిఫ్, మధ్యవర్తి సుల్తానాతో పాటు బిడ్డను కొనుగోలు చేసిన మరో వ్యక్తిని తదుపరి విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story