ప‌ట్ట‌ప‌గ‌లు బురఖాల‌తో బంగారం దుకాణంలోకి చొర‌బ‌డ్డారు.. స్కెచ్ వ‌ర్క‌వుట్ అయిందా..?

హైదరాబాద్ శివారు మేడ్చల్‌లో గురువారం బురఖా ధరించిన ఇద్దరు దొంగలు బంగారం దుకాణంలో బీభ‌త్సం సృష్టించారు.

By Medi Samrat  Published on  20 Jun 2024 6:21 PM IST
ప‌ట్ట‌ప‌గ‌లు బురఖాల‌తో బంగారం దుకాణంలోకి చొర‌బ‌డ్డారు.. స్కెచ్ వ‌ర్క‌వుట్ అయిందా..?

హైదరాబాద్ శివారు మేడ్చల్‌లో గురువారం బురఖా ధరించిన ఇద్దరు దొంగలు బంగారం దుకాణంలో బీభ‌త్సం సృష్టించారు. క‌త్తిలో షాపులో చొర‌బ‌డటంతోపాటు బెదిరింపుల‌కు దిగ‌గా.. ఆ దోపిడీ ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్న కార‌ణంగా నగల దుకాణం యజమాని గాయపడ్డాడు.

వివ‌రాళ్లోకెళితే.. మేడ్చల్‌లోని కొంపల్లిలో ఉన్న జగదాంబ జ్యువెలర్స్‌లోకి ఇద్దరు దుండగులు ఉదయం 11 గంటల సమయంలో ప్రవేశించారు. అందులో ఓ వ్యక్తి పెద్ద కత్తి తీసి విలువైన వస్తువులను తనకు అప్పగించాలని షాపు యజమానిని బెదిరించాడు. ఆ స‌మ‌యంలో షాప్‌లో కూర్చున్న ఓ సేల్స్‌మెన్ స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి విలువైన వస్తువులు ఉన్న గ‌దికి తాళం వేశాడు.

అప్ప‌టికే దుండగుడు కత్తితో య‌జ‌మాని భుజంపై దాడి చేసినప్పటికీ.. యజమాని దుకాణం నుంచి బయటకు పరుగులు తీశాడు. అత‌డు బయటకు వచ్చి సాయం కోసం కేకలు వేయడంతో దుండగులు భయాందోళనకు గురై పారిపోయారు. అప్పుడే సేల్స్ మాన్ బయటకు వచ్చి దొంగపై కుర్చీ విసిరాడు. అది దొంగ‌కు తగిలింది. అయినా ప‌ట్టించుకోకుండా దుండగులు మోటార్‌సైకిల్‌పై పరారయ్యారు. ఈ దోపిడీ ప్రయత్నమంతా షాపులో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఫుటేజీని పోలీసులు సేకరించారు. కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Next Story