కార్లను అద్దెకు తీసుకుంటారు.. వేరే వాళ్ల‌కు రెంట్‌కు ఇస్తారు.. ఓన‌ర్ల‌ను మోసం చేస్తూ...

ఓనర్ల అనుమతి లేకుండా వాహనాలను అద్దెకు ఇస్తూ.. కారు యజమానులను మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  2 Dec 2024 8:07 PM IST
కార్లను అద్దెకు తీసుకుంటారు.. వేరే వాళ్ల‌కు రెంట్‌కు ఇస్తారు.. ఓన‌ర్ల‌ను మోసం చేస్తూ...

హైదరాబాద్: ఓనర్ల అనుమతి లేకుండా వాహనాలను అద్దెకు ఇస్తూ.. కారు యజమానులను మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. సెల్ఫ్ డ్రైవ్ కు కార్లను ఇస్తే నెలనెలా అద్దె చెల్లిస్తామంటూ కార్లను తీసుకుని, వేరే వారికి అప్పగించి నెలనెలా వారి వద్ద రెంట్ తీసుకుంటూ ఉన్నారు. అసలు ఓనర్లకు అద్దె చెల్లించకుండా ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు. దీంతో కారు ఓనర్లు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

కార్ల యజమానులను మోసం చేసిన జూపూడి ఉష, తుడుముల మల్లేష్, సాగర్ పాటిల్, అనిల్ జమానేలను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. కార్లను అద్దె ప్రాతిపదికన తీసుకుని ఉష, మల్లేష్‌లు 21 మంది కార్ల యజమానులను మోసం చేశారని పోలీసులు తెలిపారు. బీదర్ కు చెందిన సాగర్ పాటిల్, బాల్కికి చెందిన జమానే అనిల్ కుమార్ కు ఇచ్చి కర్ణాటక ప్రాంతంలో అద్దెకు ఇచ్చి అక్కడ తిప్పుతూ వారి నుండి నెలనెలా అద్దె వసూళ్లు చేస్తున్నారు. కానీ కార్ల అసలు ఓనర్లకు తమ కారు ఎక్కడ ఉందనే విషయం తెలియదు.

వాహనాలను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదుదారులు, ఇతర కార్ల యజమానులు జూపూడి ఉషను సంప్రదించగా స్పందన రాలేదు. అనంతరం కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో, నిందితుల వద్ద నుండి కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్లలో మహీంద్రా థార్, మారుతీ సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా, స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్, ఇతర వాహనాలు ఉన్నాయి.

Next Story