9 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం

Hyderabad Crime News. సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచార, హ‌త్య‌ ఘటన మరువక ముందే

By Medi Samrat  Published on  16 Sep 2021 4:31 AM GMT
9 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం

హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచార, హ‌త్య‌ ఘటన మరువక ముందే మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణం చోటుచేసుకుంది. వివ‌రాళ్లోకెళితే.. మంగళహాట్ పోలీసు స్టేష‌న్‌ పరిధి హబిబ్ నగర్ లోని మాంగారు బస్తీలో ఓ తొమ్మిదేళ్ల చిన్నారిని ఖాళీగా వున్న దుకాణం షేటర్ లోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేయబోయాడు సుమిత్ అనే వ్య‌క్తి. స్థానికులు గ‌మ‌నించి నిల‌దీయ‌డంతో సుమిత్ ప‌రార‌య్యాడు. దీంతో బాలిక పెద్ద గండం నుండి బ‌య‌ట‌ప‌డింది. నిందితుడు సుమీత్‌ను లంగర్ హౌస్ లోని అత్తాపూర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Next Story
Share it