16 నెలల చిన్నారిపై తండ్రి హత్యాచారం.. తల్లి సహకారం.. ఇద్దరు అరెస్ట్‌

Hyderabad couple arrested on charges of sexual assault and murder of their minor daughter. హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. అభం శుభం తెలియని 16 నెలల చిన్నారిపై

By అంజి  Published on  8 Jan 2022 7:53 AM IST
16 నెలల చిన్నారిపై తండ్రి హత్యాచారం.. తల్లి సహకారం.. ఇద్దరు అరెస్ట్‌

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. అభం శుభం తెలియని 16 నెలల చిన్నారిపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాసింత కనికరం లేకుండా గొంతు నులిమి హత్య చేశాడు. హైదరాబాద్‌కు చెందిన దంపతులు తమ 16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడంతో మహారాష్ట్రలోని షోలాపూర్ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. ఈ జంట రాజస్థాన్‌కు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు సికింద్రాబాద్‌లో రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. రైలు ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి చిన్నారి నిద్రిస్తుండడంతో సహ ప్రయాణికులకు అనుమానం వచ్చింది.

దాదాపు ఆరు గంటల పాటు చిన్నారి కదలిక లేకపోవడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, వారు షోలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. మైనర్ కుమార్తెను గొంతు నులిమి చంపే ముందు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. దీనికి చిన్నారి తల్లి కూడా సహకరించింది. నిందితుడు ఆ తర్వాత అతని భార్య తీసుకుని సాక్ష్యాలను నాశనం చేయడానికి రాజస్థాన్‌లోని వారి స్వగ్రామానికి బయల్దేరారు. రైల్వే అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ అమోల్ గావ్లీ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును హైదరాబాద్ పోలీసులకు అప్పగించనున్నారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story