తన భార్య, ఆమె ప్రేమికుడి చేతిలో హత్యకు గురైన ఒక సంవత్సరం తర్వాత, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక వ్యక్తి అవశేషాలు అతని ఇంట్లోనే బయటపడ్డాయి. బీహార్‌కు చెందిన మహ్మద్ ఇజ్రాయెల్ అక్బరాలి అన్సారీ 2015లో రూబీతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారు సివాన్ జిల్లాలోని వారి గ్రామం నుండి దూరంగా ఉంటున్నాడు. అతను అహ్మదాబాద్‌లో మేసన్‌గా పనిచేస్తుండేవాడు. వారి ఇద్దరు పిల్లలతో కలిసి నివసించేవాడు.
అయితే పెళ్ళైన రూబీకి ఇమ్రాన్ అక్బర్‌భాయ్ వాఘేలా తో ప్రేమ చిగురించింది. అన్సారీకి ఈ విషయం తెలియడంతో తన భార్యను శారీరకంగా హింసించేవాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని రూబీ ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇక రూబీ, వాఘేలా, మరో ఇద్దరితో భర్తపై కత్తితో దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత నిందితులు రూబీ, అన్సారీ ఇంటి వంటగది ప్లాట్‌ఫారమ్ కింద ఒక గొయ్యి తవ్వి, మృతదేహాన్ని పూడ్చిపెట్టి, సిమెంట్, టైల్స్‌తో కప్పెట్టేశారు. ఈ విషయం అప్పట్లో ఎవరికీ తెలియలేదు.
ఒక సంవత్సరం తర్వాత, క్రైమ్ బ్రాంచ్ వాఘేలాను అరెస్టు చేసింది. విచారణ సమయంలో అతను అన్సారీని ఖననం చేసిన ప్రదేశానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించారు మృతదేహాన్ని వెలికితీసే ప్రక్రియలో, ఎముకలు, కణజాలాలు, వెంట్రుకలతో సహా పలు అవశేషాలు కనుగొన్నారు. హత్య, సాక్ష్యాలను నాశనం చేసినందుకు నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రూబీ, మరో ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.