దారుణం.. అనుమానంతో భార్యను కొట్టి చంపిన భర్త.!

Husband murdered his wife in guntur. అనుమానంతో భార్యను హత్య చేశాడో ఓ భర్త. పంట పొలంలో అతి దారుణంగా భార్యను హతమార్చాడు. భార్యను

By అంజి  Published on  17 Oct 2021 7:25 AM GMT
దారుణం.. అనుమానంతో భార్యను కొట్టి చంపిన భర్త.!

అనుమానంతో భార్యను హత్య చేశాడో ఓ భర్త. పంట పొలంలో అతి దారుణంగా భార్యను హతమార్చాడు. భార్యను మూడో కంటికి తెలియకుండా కనిపించకుండా చేసేందుకు యత్నించాడు. కానీ అది బెడిసికొట్టింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురానికి చెందిన బుజ్జికి, వట్టిచెరుకూరు మండలం చౌపాడుకు చెందిన కిరణ్‌తో 18 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పాపురంలో దంపతులు ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్యకు బయటి వ్యక్తులతో వివాహేత సంబంధం అంటగట్టి భర్త కిరణ్‌ తరచూ గొడవపడేవాడు. రోజు మద్యం సేవిస్తూ భార్య బుజ్జిని చిత్రహింసలకు గురిచేసేవాడు. భార్యభర్తల మధ్య కలహాలు వస్తుండడంతో రెండుసార్లు కుటుంబ పెద్దలు కలుగజేసుకొని వారికి నచ్చజెప్పారు. అయిన వారి వ్యవహారంలో మార్పు రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.

పెద్దలతో సంబంధం లేకుండా భార్యభర్తల మధ్య రాజీ కుదిర్చినప్పటికి భర్త కిరణ్‌లో మాత్రం అనుమానం పోలేదు. నిన్న ఉదయం భార్యభర్తలు ఇద్దరు పోలం పనులకు వెళ్లారు. మధ్యాహ్నం పెట్రోల్‌ కోసం ఇంటికి వచ్చి తిరిగి పొలంకు వెళ్లాడు భర్త కిరణ్. ఇంతలోనే భార్య బుజ్జి అపస్మారక స్థితిలో పడిపోయిందని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. భార్య బుజ్జిని ఆర్‌ఎంసీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యుడు నిర్దారించాడు. అనుమానంతోనే భార్యను కిరణ్ అతి కిరాతకంగా చంపాడని బుజ్జి సోదరుడు ఫిర్యాదులో తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య తల వెనుక భాగంగలో రాయితో కొట్టి చంపినట్లుగా భావిస్తున్నారు. తప్పించుకునేందుకే భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లిందంటూ నిందితుడు చెబుతున్నాడని బుజ్జి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా వైద్య పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story
Share it