రూ.1.5 లక్షల కట్నం తీసుకురా.. లేదంటే కాళ్లు నరికేస్తాం.. భార్యకు భర్త, అత్తమామల బెదిరింపులు

Husband, in-laws threaten woman to chop off her legs for Rs 1.5 lakh dowry. మరింత కట్నం తీసుకురావాలని అత్తమామలు, భర్త చేసిన దాడులు, బెదిరింపులతో విసిగిపోయిన 24 ఏళ్ల యువతి

By అంజి  Published on  3 Jan 2022 12:16 PM GMT
రూ.1.5 లక్షల కట్నం తీసుకురా.. లేదంటే కాళ్లు నరికేస్తాం.. భార్యకు భర్త, అత్తమామల బెదిరింపులు

మరింత కట్నం తీసుకురావాలని అత్తమామలు, భర్త చేసిన దాడులు, బెదిరింపులతో విసిగిపోయిన 24 ఏళ్ల యువతి గురువారం అహ్మదాబాద్‌లోని దరియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రుల నుంచి రూ.1.5 లక్షలు ఇప్పించాలని భర్త, అత్త, మామలు తనను చిత్రహింసలకు గురిచేశారని ఫిర్యాదు చేసింది. వారి డిమాండ్లను అంగీకరించడానికి నిరాకరించడంతో తన భర్త తనను వికలాంగుడిని చేసేందుకు కాళ్లు నరికేస్తానని బెదిరించాడని తెలిపింది. తన భర్తతో పాటు కుటుంబంలోని మరో నలుగురు సభ్యులపై క్రూరత్వం, గృహహింసకు పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు దరియాపూర్ పోలీసులు గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బాధితురాలికి 2017 లో వివాహం జరిగింది. ఆమె వివాహం సమయంలో.. ఆమె తండ్రి ఆమెకు కట్నం ఇచ్చాడు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే అత్తమామలు, ఆమె భర్త.. ఆమెను తన తల్లిదండ్రుల నుండి మరింత డబ్బు కావాలని కోరుతూ చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. కట్నం తీసుకురాలేదని నిత్యం చెబుతూ భర్త తనపై దాడి చేసేవాడని బాధితురాలు ఆరోపించింది. తల్లిదండ్రుల ఇంటి నుంచి రూ.1.5 లక్షలు ఇప్పించాలని భర్త, అత్తమామలు ఒత్తిడి తెస్తున్నారని, లేని పక్షంలో కాళ్లు నరికివేస్తామని బాధితురాలు తెలిపింది.

ఆ మహిళ దాడులు, బెదిరింపులతో విసిగిపోయింది. ఆమె తన అత్తమామల ఇంటిని వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కానీ సంఘం నాయకులు జోక్యం చేసుకోవడంతో, ఆమెను తిరిగి తన భర్త ఇంటికి వెళ్లమని చెప్పినా వారు ఆమెను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించారు. దీని తరువాత ఆమె స్థానిక పోలీసులకు ఒక దరఖాస్తు ఇచ్చింది. అయితే ఆమె అత్తమామలు ఎలాగో ఆమె తల్లిదండ్రులను ఒప్పించి దరఖాస్తును ఉపసంహరించుకున్నారు.

Next Story