కత్తిపీటతో గొంతు కోసుకున్న భర్త..!

Husband commits suicide in noothankal. ఓ వ్యక్తి కత్తిపీటతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన నల్గొండ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది.

By అంజి  Published on  15 Nov 2021 5:39 AM GMT
కత్తిపీటతో గొంతు కోసుకున్న భర్త..!

ఓ వ్యక్తి కత్తిపీటతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన నల్గొండ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నూతనల్‌ మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి రాములు, తన భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. భర్త రాములు వ్యవసాయం చేస్తుంటాడు. భార్య ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు కూడా హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నారు. రెండు రోజులుగా రాములు భార్య ట్రైనింగ్‌ కోసం నల్గొండ పట్టణంలో ఉంటోంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్త రాములు కత్తిపీటతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

ఇంట్లో ఎదో అలజడి కావడం గమనించిన రాములు తండ్రి సాయిలు వెంటనే ఇంట్లోకి వెళ్లి చూశాడు. కొడుకు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండడంతో గట్టిగా కేకలు వేస్తూ అరిచాడు. వెంటనే ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు రాములను వెంటనే సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాములు పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు పోలీసులను వివరణ కోరారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2013లో షేక్‌పేట్‌కు చెందిన సంతోష్‌కు కల్యాణితో అనే అమ్మాయితో వివాహం జరిగింది. సంతోష్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. గత కొంత కాలంగా అభిరామ్‌ అనారోగ్యంతో ఉండడంతో సంతోష్‌ను భార్య కళ్యాణి, ఆమె కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారు. దీంతో ఆన్‌లైన్‌ పురుగుల మందు తెప్పించుకుని.. దానిని కూల్‌ డ్రింక్‌లో కలుపుకుని తాగి సంతోష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న సంతోష్‌.. తన చావుకు భార్య కళ్యాణి, ఆమె కుటుంబ సభ్యులు అని పేర్కొన్నాడు.

Next Story
Share it