సోషల్‌ మీడియాలో భార్య అసభ్య దృశ్యాలు.. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన భర్త

Husband commits suicide after seeing his wifes obscene scenes on social media in East Godavari. తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్య వేరే వ్యక్తితో

By అంజి  Published on  17 Jan 2022 3:10 AM GMT
సోషల్‌ మీడియాలో భార్య అసభ్య దృశ్యాలు.. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన భర్త

తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్య వేరే వ్యక్తితో అసభ్యకరంగా ఉన్న దృష్యాలు సోషల్‌మీడియాలో చూడటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆ వెంటనే తన పిల్లలకు విషం తాగించి, తాను తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం 10 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వంగలపూడికి చెందిన 30 ఏళ్ల మహిళ ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లింది. ఆమె భర్త గోకవరంలో ఉంటుండంగా, వారి ఇద్దరు కుమారులు, కుమార్తె అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్నారు. తండ్రి అప్పుడప్పుడు పిల్లలను చూడటానికి అక్కడి వచ్చి వెళ్తుంటాడు. మొన్న సాయంత్రం వంగలపూడికి వచ్చిన తండ్రి.. తన ముగ్గురు పిల్లలను బయటకు తీసుకెళ్లాడు.

అక్కడే తాను ఎలుకల మందు తాగాడు. ఆ తర్వాత తన ముగ్గురు పిల్లలకు తాగించే ప్రయత్నం చేయగా.. 10 ఏళ్ల కొడుకు మందు తాగేశాడు. అప్పటికే తండ్రి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో ఆ ఇద్దరు పిల్లలు విషం తాగలేదు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని బాధితులను ఓ ఆస్పత్రిలో చేర్చించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో.. బంధువుల ద్వారా సోషల్‌ మీడియాలో తన భార్య వీడియో వచ్చిందని, దాంతో తాను మనస్తాపానికి గురైయ్యానని, అందుకే ఇలా చేశానని చెప్పాడు. అయితే పోలీసులు ఇంకా ఆ వీడియోలను పరిశీలించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it