గొంతు కోసి.. కారంపోడి చల్లి భర్తను హత్య.. భార్యపై అనుమానం..!

Husband brutally murdered in Hyderabad. ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌ పరిధిలోని హయత్‌నగర్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..

By అంజి  Published on  24 Oct 2021 10:59 AM GMT
గొంతు కోసి.. కారంపోడి చల్లి భర్తను హత్య.. భార్యపై అనుమానం..!

ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌ పరిధిలోని హయత్‌నగర్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం విజయవాడ నేషనల్‌ హైవేలో హయత్‌నగర్‌ దగ్గరలో స్థానికులు ఓ కారులు మృత దేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. వ్యక్తిని హత్య చేసి కారంపొడి చల్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీంలు క్షుణ్ణంగా పరిశీలించాయి. కారులో దొరికిన ఆర్సీ ఆధారంగా మృతుడు సైదబాద్‌లో నివాసం ఉంటున్న చెందిన ముస్కాన్‌ పటేల్‌గా పోలీసులు గుర్తించారు.

ముస్కాన్‌ను దారుణంగా కొట్టి హత్య, గొంతు కోశారని, నగర శివారు ప్రాంతంలో డేడ్‌బాడీ పడేసేందుకు తీసుకెళ్తుండగా హయత్‌నగర్‌ రాగానే కారు ఆగిపోవడంతో కారంపొడి చల్లి పారిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముస్కాన్‌ పటేట్‌ (45), తన భార్య ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులతో కలిసి సైదాబాద్‌లోని సపోటాబాగ్‌లో అద్దెకు నివాసం ఉంటున్నారు. వీరి స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్‌. ముస్కాన్‌ పటేల్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తుండగా, భార్య ఫిర్దోద్‌ బేగం మండీ నడుపుతోంది. వరుసకు మరిది అయిన హమీద్‌ పటేల్‌తో ఫిర్దోద్‌ బేగం రెండేళ్లుగా వివాహేతర సంబంధం నడుపుతున్నట్లు ముస్కాన్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఫిర్దోద్‌ బేగం, హమీద్‌, మరో వ్యక్తి కలిసి ముస్కాన్‌ పటేల్‌ను హత్య చేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it