సర్జికల్‌ బ్లేడ్‌తో భార్యపై దారుణంగా దాడి.. ఉరివేసుకుని భర్త ఆత్మహత్య

Husband attacks wife with surgical blade, hangs himself to death. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాన్సీ బజాజ్ అనే 22 ఏళ్ల మహిళపై ఆమె భర్త రామ్‌కుమార్ దాడికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  24 Jan 2022 7:54 AM IST
సర్జికల్‌ బ్లేడ్‌తో భార్యపై దారుణంగా దాడి.. ఉరివేసుకుని భర్త ఆత్మహత్య

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాన్సీ బజాజ్ అనే 22 ఏళ్ల మహిళపై ఆమె భర్త రామ్‌కుమార్ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాన్సీ బజాజ్, ఆమె భర్త రామ్‌కుమార్‌కు గత కొన్నేళ్లుగా విభేదాలు వస్తున్నాయి. ఫలితంగా మాన్సీ తన భర్త ఇంటిని వదిలి జనవరి 15 న తన తల్లి ఇంటికి వచ్చింది. జనవరి 19న, రామ్‌కుమార్ తన అత్తగారి ఇంటికి వెళ్లి నసీబ్ విహార్‌లోని తమ ఇంటికి తనతో పాటు రావాలని భార్యను అభ్యర్థించగా, దానికి మాన్సీ నిరాకరించింది. ఇంట్లో మాన్సీ తల్లి రేఖా బజాజ్ కూడా ఉన్నారు. రాత్రి 7:30 గంటలకు రేఖా బజాజ్ దంపతులను ఇంట్లో వదిలి మార్కెట్‌కి వెళ్లింది.

ఆపై భర్త రామ్‌కుమార్ భార్య మాన్సీపై సర్జికల్ బ్లేడ్‌తో దాడి చేశాడు. ఆమె మెడ చుట్టూ, రెండు చెంపలపై పలుమార్లు తీవ్ర గాయాలయ్యాయి. మాన్సీ చనిపోయిందని అనుకుని ఇంట్లో నుంచి పారిపోయాడు. పోలీసు బృందం ట్రాన్స్ యమునా ప్రాంతంలో అనేక ప్రదేశాల్లో గాలింపు చేసింది, కానీ నిందితుడి ఆచూకీని ట్రేస్ చేయలేకపోయింది విచారణ సమయంలో, సాంకేతిక విచారణ, ఫిర్యాదుదారు నుండి వచ్చిన క్లూల ఆధారంగా జనవరి 21 న, పోలీసు బృందం నిందితుడి బావమరిది బాబూలాల్‌తో కలిసి బాబూలాల్ ఇల్లు అయిన అంబేద్కర్ కాలనీకి చేరుకుంది. పోలీసులు డోర్‌ను తెరిచి చూడగా నిందితుడు రామ్ కుమార్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. బాధితురాలు మాన్సీ డీడీయూ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.

Next Story