పిల్లలు పుట్టలేదని భార్యకు వేధింపులు.. బీహార్ కు చెందిన మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్త

పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని భార్యకు టార్చర్ చూపించాడు.

By Medi Samrat  Published on  19 March 2024 5:02 PM IST
పిల్లలు పుట్టలేదని భార్యకు వేధింపులు.. బీహార్ కు చెందిన మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్త

పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని భార్యకు టార్చర్ చూపించాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టేవారని.. అందుకు అత్తామామలు కూడా కూడా వంత పాడేవారంటూ ఓ వివాహిత తాను అనుభవించిన బాధ‌ను బయటపెట్టింది. శాంతిపురం మండలం ఎం.కె.పురంకు చెందిన మహిళ హిమ బిందు.. తన భర్త, అత్తమామలు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.

కుప్పం మండలం వసనాడుకు చెందిన శివశంకర్‌ను హిమబిందు ఏడేళ్ల క్రితం వివాహాం చేసుకుంది. అయితే ఆ జంటకు ఇంకా పిల్లలు లేరు. తనకు పిల్లలు పుట్టలేదనే నెపంతో భర్త, ఆయ‌న కుటుంబీకులు వేధిస్తున్నారని హిమబిందు కన్నీటి పర్యంతమైంది. తనకు తెలియకుండా బీహార్ కు చెందిన మైనర్ బాలికను పెళ్లిచేసుకుని ఇంటికి వచ్చారని హిమ బిందు వాపోయింది. భర్తను నిలదీయడంతో హిమ బిందుపై దాడిచేశారు. శివ శంకర్, అతడి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని హిమబిందు కోరారు. తనకు అయిన గాయాలను కూడా హిమ బిందు మీడియాకు చూపించింది.

Next Story