ఐదేళ్ల‌ బాలికపై 12 సంవ‌త్స‌రాల‌ బాలుడు అత్యాచారం

Humanity shamed in UP. మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటు చేసుకుంది

By M.S.R  Published on  1 Feb 2022 12:03 PM IST
ఐదేళ్ల‌ బాలికపై 12 సంవ‌త్స‌రాల‌ బాలుడు అత్యాచారం

మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటు చేసుకుంది. బదౌన్‌లోని జరీఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరుకు తోటలోకి తీసుకెళ్లి 5 ఏళ్ల అమాయక బాలికపై 12 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చిన్నారిని అడగ్గా ఏడుస్తూ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. మైనర్ బాలుడిని బరేలీలోని జువైనల్ హోంకు తరలించారు.

జరీఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుందని రూరల్‌ పోలీసు సూపరింటెండెంట్‌ సిద్ధార్థ్‌ వర్మ తెలిపారు. 5 ఏళ్ల బాలిక ఆదివారం ఇంటి బయట ఆడుకుంటోంది. గ్రామానికి చెందిన 12 ఏళ్ల మైనర్ చెరుకు తినిపించే నెపంతో బాలికను పొలంలోకి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి బరేలీలోని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్పీ సిద్ధార్థ్ వర్మ తెలిపారు. నిందితుడి డీఎన్‌ఏ నమూనాను కూడా భద్రపరుస్తామని తెలిపారు. చిన్న వయసులోనే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడనే వార్త అందరినీ షాక్ కు గురిచేసింది.


Next Story