యాదగిరిగుట్ట మండల కేంద్రం పెద్దకందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో డ్యూటీలో ఉన్న ఎనిమిది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను యాజమాన్యం హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అందులో ఒక కార్మికుడు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతి చెందిన కార్మికుడిది బచ్చెన్నపేట్‌గా చెబుతున్నారు.
ఇదిలావుంటే.. భారీ శబ్దంతో రియాక్టర్ పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. పేలుడు జరిగిన రియాక్టర్ దగ్గరలో కార్మికులు ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదని యాజమాన్యం తెలిపింది. పేలుడు జరిగిన వెంటనే సైరన్ మోగిస్తూ మిగతా కార్మికులను అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ బయటకు తరలించినట్లు పేర్కొంది.