భారీ అగ్నిప్రమాదం.. ల‌క్ష‌ల్లో ఆస్తి న‌ష్టం

House gutted in fire in Adilabad. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో సోమవారం ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  11 April 2022 9:22 AM GMT
భారీ అగ్నిప్రమాదం.. ల‌క్ష‌ల్లో ఆస్తి న‌ష్టం

ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో సోమవారం ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు మండలంలో అగ్నిమాపక యంత్రాలు, డిపార్ట్‌మెంట్లు లేకపోవడంతో మంటల్లో ఇళ్లు పూర్తిగా దగ్ధమయింది. సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్థులు, స్థానికుల సహకారంతో మంటలను ఆర్పేందుకు దాదాపు గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్‌కు రూ.7 లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

అయితే ఇక్కడ ఏడాదిలో 10-15 అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు పరిష్కారం చూపడం లేదని స్థానిక ప్ర‌జ‌లు వాపోతున్నారు. భవిష్యత్తులో పెద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా బోధ్‌లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.


Next Story
Share it