జనవరి 1, 2025 లోపు భార్యను చంపేస్తానంటూ బెదిరించిన ఓ వ్యక్తి అన్నంత దారుణం చేశాడు. కోకాపేట గ్రామం గండిపేటలో భార్య పిట్టల సునీత (34)ను హత్య చేశాడు పిట్టల ముత్యాలు (38). అతడిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్న ఈ జంటకు 16 ఏళ్ల కిందట వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
ముత్యాలు తన భార్య సునీతను నిత్యం కొడుతూ ఉండేవాడు. జనవరి 1, 2025లోపు చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని సునీత బంధువు శ్రీలతకు తెలిసింది. గురువారం కూడా మరోసారి గొడవ జరిగింది. సునీత అపస్మారక స్థితిలో పడి ఉందని శ్రీలతకు ఇరుగుపొరుగు వారి నుంచి మళ్లీ కాల్ వచ్చింది. శ్రీలత సునీతను ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. సునీత బంధువు శ్రీలత ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన కారణాలను పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు.