ఆస్పత్రిలో వృద్ధ మహిళ రోగికి వేధింపులు.. వార్డ్ బాయ్ అరెస్ట్

Hospital ward boy arrested for molesting elderly woman patient. దేశంలో మహిళలు, చిన్నారులపై వేధింపులు ఆగడం లేదు. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది.

By అంజి
Published on : 23 Feb 2022 5:21 PM IST

ఆస్పత్రిలో వృద్ధ మహిళ రోగికి వేధింపులు.. వార్డ్ బాయ్ అరెస్ట్

దేశంలో మహిళలు, చిన్నారులపై వేధింపులు ఆగడం లేదు. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. డోంబివిలి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వార్డ్ బాయ్‌ 75 ఏళ్ల వృద్ధురాలిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు వార్డ్‌ బాయ్‌ని అరెస్టు చేసినట్లు అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ మధ్య తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాని వృద్ధురాలు తెలిపింది. రామ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన అధికారి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఆస్పత్రిలోని ఎక్స్‌రే గదికి తీసుకెళ్లినప్పుడు నిందితులు తనను రెండు సార్లు వేధించారని మంగళవారం తన పోలీసు ఫిర్యాదులో వృద్ధ మహిళ పేర్కొంది అని అన్నారు. ఈ ఘటన గురించి మొదట్లో ఎవరికీ చెప్పని సదరు వృద్ధురాలు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 (వేధింపు) కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ సాగుతోంది.

Next Story