సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఓ అసభ్యకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రిలో ట్రైన్సింగ్ నర్సుతో సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆవరణలో నర్సింగ్ చౌహన్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై వెంకట్ రెడ్డి వెల్లడించారు. నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రి ఓ మహిళ ట్రైనింగ్ నర్సుగా విధులు నిర్వహిస్తోంది. డిసెంబర్ 1వ తేదీన ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహన్.. ట్రైనింగ్ నర్సును తన ఛాంబర్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మహిళ వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తాను వరుసకు నీకు బావ అవుతానని, చెంపలపై చేయి వేశాడు. అసభ్యకరంగా తాకాడని బాధితురాలు చెప్పిందని పోలీసులు తెలిపారు.
దేశంలో మహిళలు, యువతులు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. సమాజంలో స్త్రీలపై కొందరు పురుషులు అరాచక ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. మహిళ ఒంటరిగా కనబడితే చాలు.. కామాంధులు రెచ్చిపోతున్నారు. బంధుత్వం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. రోజు రోజుకి మహిళలకు రక్షణ కరవు అవుతోంది. దేశంలో మహిళలను వేధించే పురుషుల సంఖ్య పెరిగిపోతోంది. మహిళల పట్ల అనుచితంగా వ్యవహారిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. వారిని ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి. అప్పుడైనా స్త్రీకి కొంత రక్షణ దొరుకుతుందేమో.