చంపాపేట్ హిట్ అండ్ రన్ కేసులో చికిత్స పొందుతూ సునీల్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. సైదాబాద్ పీఎస్ పరిధి చంపాపేట గ్రీన్ పార్క్ కాలనీ వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సునీల్ కుమార్ అనే యువకుడిని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. అనంతరం ఆ కారు.. యువకుణ్ని సుమారు 50 నుంచి 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో సునీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు.