హైద‌రాబాద్‌లో మ‌రో హిట్ అండ్ ర‌న్‌ కేసు

Hit and Run case in Amberpet. హైద‌రాబాద్ అంబ‌ర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Medi Samrat  Published on  26 July 2023 3:18 PM IST
హైద‌రాబాద్‌లో మ‌రో హిట్ అండ్ ర‌న్‌ కేసు

హైద‌రాబాద్ అంబ‌ర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ప్ర‌మాదానికి సంబంధించి పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకున్నారు. ఓ కారు డ్రైవర్ అత్యంత వేగంగా వచ్చి ఓ వృద్ధురాలిని ఢీ కొట్ట‌డంతో తీవ్రగాయాలై మృతిచెందింది. వివ‌రాళ్లోకెళితే.. అంబ‌ర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి కింగ్ ప్యాలెస్ హోటల్ సమీపంలో ఓ వృద్ధురాలు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. కారు వేగానికి వృద్ధురాలు ఎగిరి రోడ్డుపై పడడంతో ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించింది.

ఈ ఘటన అంబ‌ర్‌పేట్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే రహదారిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అంబ‌ర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలిని అంబ‌ర్‌పేట్ లో నివాసం ఉంటున్న ముత్యాలమ్మగా గుర్తించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Next Story