దూరదర్శన్‌ కేంద్రంలోని మ‌హిళ‌ల బాత్‌రూమ్‌లో కెమెరా కలకలం.. !

Hidden camera found in woman's washroom at Doordarshan Centre. దూరదర్శన్‌ కేంద్రంలోని మహిళల వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరా కలకలం రేపుతోంది. వాష్‌రూమ్‌కి వెళ్లిన మహిళా ఈ హిడెన్‌ కెమెరాను

By అంజి  Published on  11 Nov 2021 12:19 PM GMT
దూరదర్శన్‌ కేంద్రంలోని మ‌హిళ‌ల బాత్‌రూమ్‌లో కెమెరా కలకలం.. !

దూరదర్శన్‌ కేంద్రంలోని మహిళల వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరా కలకలం రేపుతోంది. వాష్‌రూమ్‌కి వెళ్లిన మహిళా ఈ హిడెన్‌ కెమెరాను గుర్తించింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం దూరదర్శన్‌ కేంద్రంలో జరిగింది. బుధవారం నాడు దూరదర్శన్‌ కేంద్రం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల వాష్‌రూమ్‌లో ఆ సంస్థ తాత్కాలిక ఉద్యోగి కెమెరాను ఇన్‌స్టాల్‌ చేసినట్లు గుర్తించారు. అతడిని విధుల నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పారు.

దూరదర్శన్‌ కేంద్రంలోని మెయిన్‌ స్టూడియో సమీపంలోని వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరాను నిందితుడు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దూరదర్శన్‌ కేంద్రం అధికారులతో కూడి మహిళా కమిటీ, క్రమశిక్షణా కమిటీలు విచారిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరువనంతపురం సైబర్‌ సెల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it