పెళ్లి కూతురు గన్ తో చేసిన రచ్చ.. ఎన్ని చిక్కులు తెచ్చిపెట్టిందో..?

Hathras Bride Air Fires Gun Shots From Her Wedding Stage. పెళ్లి రోజు ఎంతో స్పెషల్ గా ఉండాలని ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.

By M.S.R  Published on  9 April 2023 7:30 PM IST
పెళ్లి కూతురు గన్ తో చేసిన రచ్చ.. ఎన్ని చిక్కులు తెచ్చిపెట్టిందో..?

పెళ్లి రోజు ఎంతో స్పెషల్ గా ఉండాలని ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లు, బారాత్ ల సమయంలో పలువురు గన్ లతో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పొచ్చు. కొన్ని కొన్ని సార్లు ఈ గన్ పేలుళ్ల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, చిక్కుల్లో కూడా పడ్డారు. తాజాగా ఓ మహిళ కూడా చిక్కుల్లో పడింది. ఓ వ్యక్తి గన్ తెచ్చివ్వడంతో ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా గాల్లోకి కాల్పులు జరిపింది. ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.

ఒక వధువు తన పెళ్లి రోజున వేదికపై నుండి వరుసగా మూడు రౌండ్లు కాల్చిన వీడియో వైరల్ గా మారింది. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఉన్నా.. ఇలా ఆయుధాలను ఉపయోగించడం చట్టవిరుద్ధం. హత్రాస్ జంక్షన్‌లోని సేలంపూర్ గ్రామంలోని గెస్ట్ హౌస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్వాలి హత్రాస్ జంక్షన్ ఇన్‌చార్జి గిరీష్ చంద్ గౌతమ్ ఈ వైరల్ వీడియోపై స్పందిస్తూ.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


Next Story