19 ఏళ్ల ప్లేస్కూల్ టీచర్ మనీషా దారుణ హత్య ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. హర్యానా రాష్ట్రం భివానీలో సింఘాని గ్రామంలో ప్రజల ఆగ్రహం పెరుగుతూనే ఉంది. ఆదివారం నిరసనల తర్వాత మహా పంచాయతీ నిర్వహించారు. ఆ సమావేశంలో మాజీ బీజేపీ మంత్రి జెపి దలాల్ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని సమావేశంలో నిర్వహించారు.
ఆగస్టు 13న సింఘానిలోని ఒక పొలంలో మనీషా మృతదేహం లభించింది. ఆమెను అతి దారుణంగా చంపేశారు. కేసుకు సంబంధించి భివానీ ఎస్పీని బదిలీ చేయాలని, ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయాలని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఆదేశించినప్పటికీ, ఈ చర్యలు సరిపోవని ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మనీషా ఆగస్టు 11న తన పాఠశాల నుండి సమీపంలోని నర్సింగ్ కళాశాలను సందర్శించడానికి బయలుదేరింది. కానీ ఇంటికి తిరిగి రాలేదు.